Tuesday, June 18, 2024

BJP పదో జాబితా ఇదే … చండీగఢ్‌ నుంచి అనుపమ్‌ ఖేర్‌ సతీమణి ఔట్‌

లోక్‌సభ ఎన్నికల మరికొన్ని స్థానాలకు బీజేపీ బుధవారం కొంత మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ పదో జాబితాలో తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. అసన్‌ సోల్ నుంచి ఎస్‌ఎస్‌ అహ్లూవాలియాను ఎంపిక చేసింది. అలాగే చండీగఢ్ సిట్టింగ్ ఎంపీ, బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్ సతీమణి కిరణ్‌ ఖేర్‌ను తప్పించి ఆ స్థానంలో సంజయ్ టాండన్‌ను బరిలో నిలిపింది.

అలాగే మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు నీరజ్‌కు యూపీలోని బాలియా నుంచి టికెట్ దక్కింది. చండీగఢ్‌, అసన్‌సోల్‌తో సహా ఆ రాష్ట్రంలోని ఏడుస్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లైంది. తొలుత పశ్చిమ్ బెంగాల్‌లోని అసన్‌సోల్ నుంచి పవన్‌సింగ్‌ పేరును ప్రకటించింది. అయితే ఆయన పాటలు మహిళల్ని అసభ్యకరంగా చిత్రీకరించేలా ఉంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ఆయనే పోటీ నుంచి వైదొలిగారు.

మైన్‌పురి -జైవీర్‌ సింగ్ ఠాకూర్‌
కౌశాంబి – వినోద్ సోంకర్‌
ఫుల్‌పుర్‌ – ప్రవీణ్‌ పటేల్‌
ప్రయాగ్‌రాజ్‌- నీరజ్‌ త్రిపాఠి
మచ్లీషహర్‌ – బీపీ సరోజ్‌
గాజీపుర్‌ – పరాస్‌ నాథ్‌ రాయ్‌

- Advertisement -

Image

Advertisement

తాజా వార్తలు

Advertisement