Sunday, June 23, 2024

రేపు బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశం

భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశం రేపు జ‌రుగ‌నుంది. అధ్య‌క్షుడిగా జేపీ న‌డ్డా బాధ్య‌త‌లు చేప‌ట్టాక తొలి భేటీ ఇది. ఉత్త‌ర ప్రదేశ్ స‌హా ఎన్నిక‌లు జ‌రిగే ఏడు రాష్ట్రాల‌పై ఫోక‌స్ పెట్ట‌నున్నారు. యూపీ, ఉత్త‌రాఖండ్, గోవా, మ‌ణిపూర్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గుజ‌రాత్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. రాజ‌కీయంగా బీజేపీకి యూపీ, గుజ‌రాత్ కీల‌కం కానుంది. ఈ రాష్ట్రాల రాజ‌కీయాల‌పై ఈ స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. ముఖ్యంగా త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఏడు రాష్ట్రాల‌పై భేటీలో స‌మీక్షించ‌నున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఇంకా ఎలా పుంజుకోవాల‌నే అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement