Friday, April 19, 2024

పార్టీలో మార్పులు చేయాల్సిందే.. టీ. కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్సీ అల్టీమేటం!

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో అసంతృప్తి అగ్ని జ్వాలల ఎగసిపడుతోంది. అగ్ర నేతల తీరుపై సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చిన నేతలతోనే పార్టీ వీడుతున్నట్లు తెలుస్తోంది.

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు అన్యాయం జ‌రుగుతోందని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌ రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే కార్య‌క‌ర్త‌ల‌ను వ‌దిలేశారని మండిపడ్డారు. కొత్త‌గా వ‌చ్చిన‌వారికి పార్టీ ప‌గ్గాలు ఇచ్చారన్న ప్రేమ్ సాగర్.. ఇంద్ర‌వెళ్లి స‌భ‌కు క‌ష్ట‌ప‌డ్డ‌ కార్య‌క‌ర్త‌ల‌ను విస్మ‌రించారని ఆరోపించారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ పార్టీలో మార్పులు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ నెల 10 వ‌ర‌కు అధిష్టానం నిర్ణ‌యం కోసం వేచి చూస్తామని, లేక‌పోతే తమ దారి మేం చూసుకుంటామని అల్టీమేటం ఇచ్చారు. అవ‌స‌ర‌మైతే కొత్త పార్టీ పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Zika virus outbreak: ఉత్తర్‌ప్రదేశ్‌లో జికా కలకలం.. 66 మందికి వైరస్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement