Monday, April 29, 2024

BJP | రేపు బీజేపీ మేనిఫెస్టో విడుదల

రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేయనున్నది. సంకల్ప పత్ర పేరిట బిజెపి మేనిఫెస్టోను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేయనున్నారు. సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన హామీలతోపాటు తమ వికసిత భారత్ లక్ష్యానికి చెందిన రోడ్డు మ్యాపును బిజెపి ఈ మేనిఫెస్టోలో పొందుపరచనున్నట్లు తెలుస్తోంది.

ప్రధాని మోడీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగా..భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నాడే బిజెపి తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుండడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement