Wednesday, October 16, 2024

Book Release | శ్రీరామ రక్షా స్తోత్రమ్.. భద్రాచలంలో పుస్తకావిష్కరణ

ధర్మావతారమైన శ్రీరామచంద్రుని కీర్తించి మహా విజయాలను పొందే అద్భుత శ్రీరామ రక్షా స్తోత్రం పుస్త‌కాన్ని శ‌నివారం భ‌ద్రాచ‌లంలో ఆవిష్క‌రించారు. భద్రాద్రి శ్రీరామనవమి ఉత్సవాల్లో వేలాది భక్తులకు ఉచితంగా పంచే భాగ్యాన్ని ప్రసాదించిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ మహాయజ్ఞ కేంద్రం ధార్మిక సేవను సీతారామచంద్ర స్వామి దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ ఎల్ నాగమణి అభినందించారు. శ్రీరామనవమి వసంతోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేడుకలో రచయిత, ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ‘ఆరాధన’ పూర్వ ప్రత్యేక సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ అందించిన ‘ శ్రీరామరక్షా స్తోత్రం’ గ్రంథాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని దేవస్థానం స్థానాచార్యులు స్థలసాయికి అందజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా.. సీతారామచంద్ర స్వామి దేవస్థానం ప్రధానాచార్యులు పి. సీతారామానుజాచార్యులు మాట్లాడుతూ.. శ్రీరామా రక్షాస్తోత్రాన్ని భక్తప్రపంచానికి అందించిన మొదటి ఘనత విఖ్యాత ఆధ్యాత్మిక వేత్త పురాణపండ రాధాకృష్ణమూర్తిదేనని చరిత్రపుటల్లో చెబుతున్నాయని, ఇప్పుడు ఆయన వారసుడైన రచయిత పురాణపండ శ్రీనివాస్ అత్యంత వేగవంతంగా చేస్తున్న ఆధ్యాత్మిక గ్రంథ రచనాకృషి ఆశ్చర్యపరుస్తోందన్నారు. దేవస్థాన సీనియర్ అసిస్టెంట్ అన్నెం శ్రీనివాస రెడ్డి సారథ్యంలో భక్తులకు ఈ గ్రంధాన్ని వితరణ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement