Thursday, October 3, 2024

ఫిల్మ్ స్టార్స్ పై బిజెపి ఫోక‌స్.. ప్ర‌ధాని మోడీతో ఉన్ని ముకుంద‌న్ భేటీ

ఈ మ‌ధ్య‌కాలంలో బిజెపి ముఖ్య నేత‌లు ప‌లువురు సినీ సెల‌బ్రిటీల‌ను క‌లుస్తుండ‌టం ప్రాధాన్య‌త‌ని సంత‌రించుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోస్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ తో వరుసగా భేటీ అవుతున్నారు. అటు కన్నడ నాట స్టార్ హీరో కిచ్చా సుధీప్ బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చారు. ఇక కేరళలో కూడా సినిమా తారలకు బీజేపీ స్పేస్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలిశారు హీరో ఉన్నిముకుంద‌న్. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు ఉన్ని ముకుందన్. థ్యాంక్యూ సార్.. 14 ఏళ్ళ తరువాత మిమ్మల్ని మళ్ళీ కలిశాను. చిన్నప్పుడు మిమ్మల్ని కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకూ.. నేను కోలుకోలేదు..

మళ్ళీ ఎప్పుడు మిమ్మల్నికలుస్తానా ..గుజరాతీలో మీతో ఎప్పుడు మాట్లాడుతానా అని ఎదురుచూస్తూ వచ్చాను. ఇన్నాళ్ళకు నాకల నిజమైయ్యింది. నా సోషల్ మీడియాలో ఇది చాలా ఉత్తేజకరమైన పోస్ట్.. అంటూ భావోద్వేగానికి లోనయ్యారు ఉన్ని ముకుందన్. మీ సమయం 45 నిమిషాలు నాకు ఇచ్చినందకు ధన్యవాదాలు.. నా జీవితంలో ఈ 45 నిమిషాలు చాలా మెమరబుల్ .. మీరు నాకు చెప్పిన మాటను నేను ఎప్పటికీ మర్చిపోలేను… ప్రతి సలహా ఆచరణలో పెడతాను. మీ సలహాలను ఖచ్చితంగా అమలు చేస్తాను అంటూ ట్వీట్ చేశారు ఉన్నిముకుందన్. అంత బిజీ షెడ్యూల్ లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్ని ముకుందన్ తో 45 నిమిషాలు టైమ్ కేటాయించడం.. హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement