Sunday, April 28, 2024

‘బింబిసార’ ట్రైలర్ లాంచ్!

కల్యాణ్ రామ్ హీరోగా .. ఆయన సొంత బ్యానర్లో ‘బింబిసార’ సినిమా నిర్మితమైంది. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 5వ తేదీన విడుదల చేయనున్నారు. అటు ‘బింబిసార’ కాలంలోను .. ఇటు వర్తమానంలోను ఈ కథ నడుస్తుంది. రెండు డిఫరెంట్ లుక్స్ తో కల్యాణ్ రామ్ కనిపించనున్నాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ వెలువడింది. ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. అటు బింబిసారుడి తీరు .. ఇటు అదే పోలికలతో ఉన్న యువకుడిని ఆయన ఆవహించిన తీరును ఈ ట్రైలర్ లో చూపించారు. సుదీర్ఘమైన డైలాగ్స్ వలన .. డైలాగ్స్ లో డెప్త్ తగ్గినట్టుగా అనిపిస్తుంది.

‘బింబిసార’ మేనరిజంగా ‘జగజ్జజ్జరిక’ వినిపిస్తోంది. మొత్తానికి కొత్త దర్శకుడితో కల్యాణ్ రామ్ సాహసమే చేశాడనిపిస్తోంది. కేథరిన్ .. సంయుక్త మీనన్ కథానాయికలుగా అలరించనున్న ఈ సినిమాకి, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు. చిరంతన్ భట్ బాణీలను సమకూర్చాడు

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement