Sunday, April 28, 2024

‘బింబిసార’ రిలీజ్ కి రెడీ..

హీరో క‌ల్యాణ్ రామ్ తాజా చిత్రం బింబిసార‌. సొంత బ్యానర్ లో .. కొత్త జోనర్ లో కల్యాణ్ రామ్ చేస్తున్న కొత్త ప్ర‌యోగాన్ని చేస్తున్నాడు. కాగా ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంద‌ట‌. అయితే బింబిసార పూర్తి చారిత్రక చిత్రం కాదని స‌మాచారం. ఈ కథ టైమ్ ట్రావెల్ చుట్టూ నడుస్తుందట‌. టైమ్ మిషన్ లో హీరో ‘బింబిసార’ కాలానికి చేరుకుంటాడు. అక్కడ జరిగే సంఘటనలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కథానాయికగా సంయుక్త మీనన్ సందడి చేయనుంది. ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఆ దిశగానే సన్నాహాలు జరుగుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement