Wednesday, May 29, 2024

Raipur : బాంబులు వ‌ర్షంలో బీజాపూర్ అట‌వీ ప్రాంతం… పోలీస్ క్యాంప్ పై మావోల దాడి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ చుట్వాహిలో పోలీసు క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు. పోలీసు క్యాంప్‌పై మావోయిస్టులు బాంబుల వర్షం కురిపించారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ లో జరిగిన ఎన్‌కౌంటర్లకు ప్రతీకారంగా అగ్ర నాయకులు ఈ దాడిలో పాల్గొన్నట్టుగా సమాచారం.

- Advertisement -

ఇది ఇలా ఉంటే… ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది. గత రెండు నెలలుగా మావోయిస్టులు, పోలీసుల మధ్య భీకర పోరు నడుస్తుంది. ఈ మధ్య జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో సుమారు 43 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. ఎన్‌కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు నేడు ఐదు రాష్ట్రాల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని, బీజాపూర్ జిల్లా, చుట్యాహి పోలీస్ క్యాంపుపై సోమవారం బాంబుల వర్షం కురిపించారు. ప్ర‌స్తుతం ఇరు వ‌ర్గాల మ‌ధ్య అయిదు గంట‌లుగా బుల్లెట్ల వార్ న‌డుస్తున్న‌ది. దీనిపై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement