Thursday, May 2, 2024

Patna: బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ రాజీనామా…

బీహార్ ముఖ్యమంత్రి పదవికి జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) చీఫ్ నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. ఆదివారం ఉదయం పాట్నాలోని తన అధికారిక నివాసంలో జేడీయూ ఎమ్మెల్యేలతో భేటీ అయిన నితీశ్.. వారితో చర్చించి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

అనంతరం నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ను కలుసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపి, రిజైన్ లెటర్ అందజేశారు. తిరిగి ఇంటికి చేరుకున్న నితీశ్ కాసేపట్లో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. కాగా, జేడీయూలో ప్రస్తుతం 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలతో కలిసి నితీశ్ కుమార్ మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని రాజకీయ వర్గాల సమాచారం. వచ్చే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీతో సీట్ల పంపకాలకు సంబంధించి నితీశ్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement