Friday, May 17, 2024

బ్యూటీ టిప్… కంటి చూపు కోల్పోయిన ‘బిగ్ బ్రదర్’ కంటెస్టెంట్!

చాలా మంది అందంగా కనిపించేందుకు మార్కెట్లో లభించే వివిధ రకాల క్రీములను వాడుతుంటారు. ముఖ్యంగా యాడ్స్ లో చూసి వాడేవారు చాలా ఎక్కువమందే ఉంటారు. అయితే క్రీముల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. లేదంటే ఈ అమ్మాయి పరిస్థితే మీకు వచ్చే ప్రమాదం ఉంది. టిక్ టాక్ స్టార్, ఆస్ట్రేలియా బిగ్ బ్రదర్ కంటెస్టెంట్ అయిన టిల్లీ విట్‌ ఫెల్డ్ అనే యువతి.. ఓ వీడియో చూసి చేసిన పనితో ఆస్పత్రిపాలైంది. టీవీ షోలు, ఫ్యాషన్ ప్రోగ్రామ్స్ చేస్తూ… నిరంతరం ఫేసుకి మేకప్ వేసుకుంటూనే ఉంది టిల్లీ విట్‌. రెండు నెలల కిందట టిక్ టాక్‌ లో ఓ అక్యుపంక్చర్ బ్యూటీ టిప్ వీడియో చూసింది. అది నచ్చడంతో అదే తహాలో ప్రయత్నించింది. అయితే అది ఆమెకు రియాక్షన్ ఇచ్చింది. ముఖంపై మచ్చలు, కురుపులు వచ్చాయి. అందమైన ఫేస్ కాస్తా… అందవికారంగా మారింది. ఈ ఘటన తర్వాత ఆమె ఆస్పత్రి పాలైంది. అంతేకాదు ఆమెకు ఎడమ కంటికి కూడా ఇన్ ఫెక్షన్ అయ్యింది. దీంతో ఆమె కంటి చూపు తాత్కాలికంగా కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement