Friday, April 26, 2024

Big Breaking : మంత్రి గంగులకు పితృ వియోగం…

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో గుండె పోటుతో మృతి చెందారు. క్రిస్టియన్ కాలనీ లోని స్వగృహంలో మృతి చెందారు. తండ్రి మరణ వార్త తెలుసుకున్న గంగుల కమలాకర్ కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. గంగుల మల్లయ్యకు నలుగురు కుమారులు, అందులో మంత్రి గంగుల చిన్న కుమారుడు. తండ్రి మృతితో మంత్రి గంగుల ఇంట విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement