Wednesday, March 29, 2023

కామారెడ్డి జిల్లాలో రైతు ఆత్మ‌హ‌త్య.. ఆందోళ‌న‌కు దిగిన రైతులు

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆడ్లూరు ఎల్లారెడ్డిలో రైతు పయ్యావుల రాములు ఆత్మహత్య వివాదాస్పదమైంది. తన పంట భూములను ఇండస్ట్రీయల్‌ జోన్‌లోకి మార్చడంతో మనస్థాపం చెందిన రైతు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధిత కుటుంబ సభ్యులు డెడ్‌ బాడీతో మున్సిపల్‌ కార్యాలయం ముట్టడికి పిలునివ్వడంతో కామారెడ్డి కొత్త బస్టాండ్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. రాములు మృతితో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మృతదేహంతో న్యూ బస్టాండ్ వద్ద చౌరస్తాలో రైతులు ధర్నాకు దిగారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement