Friday, May 3, 2024

Big Breaking | వరల్డ్ కప్‌లో మరో సంచలనం.. సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయం!

వరల్డ్ కప్ లో ఇవ్వాల మరో సంచలనం నమోదయ్యింది. ధర్మశాలలో వర్షం కార‌ణంగా లేటుగా ప్రారంభమైన మ్యాచ్ లో… తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. అయితే, చేజింగ్ లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లను కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలో 207 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో నెదర్లాండ్స్ 38 ప‌రుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది.

సౌతాఫ్రికా జట్టు 11.2 ఓవర్లలోనే 44 పరుగుల‌కు 4 వికెట్లు కోల్పోయింది.. పేవ‌ల‌మైన బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో తొంద‌ర్లోనే క‌ష్టాల్లో ప‌డింది. కెప్టెన్ బవుమా (16), క్వింటన్ డికాక్ (20), వాన్ డర్ డుస్సెన్ (4), ఐడెన్ మార్ క్రమ్ (1), క్లాసేన్ (28), మార్కో జాన్సేన్ (9) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. అయితే హెన్రిచ్ క్లాసెన్ డేవిడ్ మిల్లర్.. జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య భాగస్వామ్యం బలపడుతున్న దశలో వాన్ బీక్ బౌలింగ్ లో క్లాసెన్ అవుటయ్యాడు. ఆ తర్వాత, జాన్సేన్(9).. మిల్ల‌ర్ (43) కూడా అవుటయ్యారు. ఇక ఆకర్లో వచ్చిన కేశవ్ మహారాజ్ (40) పరుగులు చేసి అవుటయ్యాడు.

ఇక.. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్ 3, వాన్ డెర్ మెర్వ్2, వాన్ మీకెరెన్2, బాస్ డి లీడ్ 2 వికెట్లు దక్కించుకున్నారు. కోలిన్ అకెర్మాన్ 1 వికెట్ తీశాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement