Thursday, May 16, 2024

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్‌ బిలియన్‌ డేస్‌ ఆఫర్‌.. ఈసారి అదిరిపోయే డిస్కౌంట్లు

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రతి ఏటా పండగ సీజన్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహిస్తుంది. అయితే ఎప్ప‌టిలాగానే ఈసారి కూడా సేల్ లో అదిరిపోయే ఆఫర్లు ఉండనున్నాయి. సేల్ తేదీలు ఇంకా ఖరారు కానప్పటికీ ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో దీని కోసం ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసింది. అదిరిపోయే ఆఫర్లు ఉంటాయని కస్టమర్లను టీజర్ రిలీజ్ చేసింది. అక్టోబర్ ప్రారంభంలో సేల్ ప్రారంభమవుతాయని అనేక డివైజ్‌లకు భారీ డిస్కౌంట్లకు లభిస్తాయని లిస్టింగ్ సూచిస్తుంది.

అలాగే ఈ సేల్ లో టాప్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల కొత్త ఫోన్లు కూడా రిలీజ్ అవుతాయని తెలిపింది. ఇందులో Samsung Galaxy S21 FE 5G, iPhoneలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ల పేర్లను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే అక్టోబర్ 1న ఐఫోన్ ఒప్పందాలను వెల్లడించనున్నట్లు టీజర్ పేజీ ధృవీకరించింది. ఇక‌, ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం వరకు డిస్కౌంట్, ఫ్యాషన్ దుస్తులపై 90 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని ఫ్లిప్ కార్ట్ పేజీ తెలియజేస్తోంది.

కాగా, ఫ్లిప్ కార్డ్ ప్లస్ మెంబర్ షిప్ ఉన్న కస్టమర్లకే సేల్ యాక్సెస్ త్వరగా ఉంటుంది. సాధారణ కస్టమర్లకు ఆఫర్లు కాస్త లేట్ గా ఉంటాయి. అయితే, సేల్ తేదీలను ఫ్లిప్ కార్టు అధికారికంగా ఖరారు చేయలేదు. దసరాకు కొద్ది రోజుల ముందు ఇది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

https://twitter.com/MrRDX00/status/1704850953554612724
Advertisement

తాజా వార్తలు

Advertisement