Friday, March 29, 2024

జ‌న‌వ‌రి 12న భీమ్లానాయ‌క్..పోస్టర్ రిలీజ్..

జ‌న‌వ‌రి 12నే భీమ్లా నాయ‌క్ చిత్రం రిలీజ్ కానుంద‌ని స్ప‌ష్టం చేశారు చిత్ర యూనిట్. సాగ‌ర్ కె చంద్ర తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్..నిత్యా మీన‌న్ జంట‌గా న‌టిస్తున్నారు. రానా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. రానికి జోడీగా సంయుక్త మీన‌న్ న‌టిస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ‘జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్టు ముందుగానే చెప్పారు. అయితే ఆ తరువాత ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా జనవరి 7వ తేదీకి వచ్చి చేరింది. దాంతో జనవారు 13న రిలీజ్ అనుకున్న మహేశ్ బాబు న‌టిస్తోన్న ‘సర్కారువారి పాట’ విడుదల తేదీని ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసుకుంది.ఈ నేపథ్యంలో ‘భీమ్లా నాయక్’ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడనుందని ప్రచారం జోరుగా జరుగుతోంది. దాంతో తమ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడలేదనే స్పష్టతను ఇస్తూ, రిలీజ్ డేట్ తో కూడా పోస్టర్ ను మరోసారి రిలీజ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement