Friday, May 3, 2024

‘భీమ్లా నాయ‌క్’ మూడో సింగిల్..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తోన్న తాజా చిత్రం భీమ్లా నాయ‌క్. ఈ చిత్రం నుంచి అప్డేట్ వ‌చ్చింది. ఈ చిత్రం నుండి మూడో సింగిల్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ”లాలా భీమ్లా” అనే లిరిక్స్‌ తో ప్రారంభం అయ్యే మూడో సింగిల్‌ ను విడుదల చేశారు. ఇక ఈ సాంగ్‌ పూర్తి గా మాస్‌ యాంగిల్‌ ఉంది. పవన్‌ కళ్యాణ్‌ యాక్షన్ సీన్స్‌ ఈ వీడియోలో మనకు కనిపించాయి. ఇక ఈ పాటకు తమన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అదరగొట్టాడు. మొత్తానికి పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ కు లాలా సాంగ్‌ మంచి ఊపునే ఇచ్చింది. మలయాళంలో హిట్‌ కొట్టిన అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ కి ఈ మూవీ రీమేక్‌. ప‌వ‌న్ కి జోడీగా నిత్యామీన‌న్ న‌టిస్తోంది. రానా విల‌న్ గా క‌నిపించ‌నున్నాడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement