Sunday, May 19, 2024

AP | భవ్యశ్రీ ది ఆత్మహత్యే.. తేల్చిచెప్పిన ఫోరెన్సిక్ నివేదిక

చిత్తూరు (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) : చిత్తూరు జిల్లాలో దాదాపు నెలరోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో సవమైన కనిపించి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భవ్యశ్రీ మృతికి ఆత్మహత్యే కారణమని ఫోరెన్సిక్ నివేదిక తేల్చిచెప్పింది. ఈ మేరకు ఈ రోజు చిత్తూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రిశాంత్ రెడ్డి వెల్లడించారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కావూరివారిపల్లి పంచాయతీ, ఠాణా వేణుగోపాలపురం గ్రామానికి చెందిన మునిక్రిష్ణయ్య కూతురు భవ్యశ్రీ (16) గతనెల 17వ తేదీ సాయంత్రం కనిపించకుండా పోయిందని ఆమె తల్లి తండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు.

ఆమె కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండగా మూడురోజుల తరువాత గత నెల 20వ తేదీ రాత్రి ప్రాంతంలో భవ్యశ్రీ మృతదేహం ఎగువచెరువు గ్రామానికి దగ్గరలో వుండే భూపాల్ రెడ్డి వ్యవసాయ బావిలో వున్నట్లు గ్రామస్తుల ద్వారా సమాచారం తెలిసింది. ఆ సందర్భంగా ఆమె తల్లితండ్రులు తమ కూతురిని గతంలో వేధింపులకు గురిచేసిన నలుగురు వ్యక్తులు అఘాయిత్యం చేసి, హత్య చేసి బావిలో పడవేసి వుంటారని ఆరోపించడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఆ నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులో తీసుకుని విచారించారు. బావిలోనుంచి బయటకు తీసిన మృతదేహం స్థితిగతులను బట్టి తమ కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డారని, గుండు కొట్టించారని, ఉరివేసి చంపి తరువాత శవాన్ని తీసుకొని వచ్చి బావిలో పడేశారని-అందువలన కళ్ళు, నాలుక ఉబ్బి బయటకు వచ్చాయని, ఆమె మృతదేహానికి లెగ్గిన్ లేదని, మొదలైన అనుమానాలను పరిగణలోకి తీసుకొని దర్యాప్తు కొనసాగింది.

- Advertisement -

దర్యాప్తులో భాగంగా నలుగురు అనుమానితుల్ని క్షుణ్ణంగా విచారించి టెక్నికల్ అనాలసిస్ ద్వారా సదరు వ్యక్తుల కాల్ డేటాలు, లొకేషన్ లు, సి సి టి వీ ఫూటేజ్ లు సేకరించుకొని, సదరు బాలిక అదృశ్యం కావడానికి ముందు, తరువాత వారి కదలికల్ని ఆరాతీయడం జరిగింది. అయితే . నేరము జరిగిన సమయంలో ఆ నలుగురు అనుమానితులు కూడా వేరు వేరు ప్రదేశాల్లో వేరు వేరు కార్య కలాపాలలో వున్నట్టు, నేరం జరిగిన ప్రదేశంలో మరియు చుట్టుపక్కల పై నలుగురిలో ఏ ఒక్కరూ కూడా లేనట్లు ప్రాథమికంగా తేలింది.

మరోవైపు 21 వ తేదీన సదరు బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్య అధికారి భవ్యశ్రీ శరీరం పై ఎటువంటి బయటి లోపలి గాయాలు లేవని, మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో వుందని, కుళ్లిపోవడం వల్ల తలపై వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయాయని, కళ్ళు , నాలుక ఉబ్బి బయటకు వచ్చాయని, ఉరివేసిన ఆనవాళ్లు కనిపించలేదని ప్రాథమికంగా రిపోర్టులో ,పేర్కొన్నారు అయినా ఫోరెన్సిక్ నివేదిక వచ్చాక ఖచ్చితఃమైన మరణ కారణం తెలుస్తుందని ఆ అధికారి చెప్పారు.

పోస్టుమార్టం అనంతరం సదరు బాలిక ఏదైనా అఘాయిత్యమునకు గురి అయినదా ;లేదా అని, నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయినదా లేదా అని, వేరే చోట చంపి తెచ్చిబావిలో పడేశారా అనే విషయాలు తెలుసుకోవడం కొరకుకొన్ని కీలక శరీర భాగాలను సాంపిల్స్ ను అనాలిసిస్ కొరకు తిరుపతి , విజయవాడలలోని లోని ఫోరెన్సిక్ ల్యాబ్ లకు పంపించారు. ఈ నేపథ్యంలో నిందితులను కాపాడేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ప్రచారం ఊపందుకుంది, సామాజిక మాధ్యమాలలో జరిగిన ప్రచారానికి స్పందించిన రాష్ట్ర స్థాయి ప్రతిపక్ష నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేయడంతో సంచలన వివాదంగా మారింది.

రాష్ట్ర మహిళా కమిషన్ఆ వంటి విభాగాలు పోలీసు అధికారులకు ఫోన్లు చేసి నిజానిజాలను తెలుసుకోవడం మొదలైంది. ఆ దశలో విచారణ వివరాలను వెల్లడించిన పోలీసులు తప్పుడు ప్రచారాలు చేసేవారిపై చర్యలు తీసుకుంటామని బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. అనుకున్న మేరకు ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తరువాత మరింత నిర్ధారణ కోసం ఆ నివేదికలను కర్నూల్ మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ ప్రొఫెసర్ కు పంపించి వారి నుంచి కూడా నివేదిక తెప్పించారు.

ఎట్టకేలకు ఫోరెన్సిక్ నివేదికలు, నిందితుల కదలికలకు సంబంధించిన దర్యాప్తు నివేదికలు రావడం తో ఈ రోజు జిల్లా ఎస్ పి రిశాంత్ రెడ్డి సంబంధిత వివరాలను వెల్లడిస్తూ ఆ బాలిక ఒంటిపై ఎటువంటి అత్యాచారాల గాయాలు లేవని, గొంతు నులిమి చంపిన ఆనవాళ్లు లేవని, నీళ్లలో శవం కుళ్ళి పోవడంతో తలపై వెంటుకలు ఊడిపోయాయని, మృతురాలి ఒంటిపై అనుమానించినట్టు లెగ్గిన్స్ లేదని నిర్ధారణ అయినట్టు వెల్లడించారు అనుమానితుల ప్రమేయం ఏమైనా ఉందా అని మరింత క్షుణ్ణంగా టెక్నికల్ టూల్స్ సహాయంతో అన్ని కోణాలలో విచారించగా ఆ సమయంలో ఈ నలుగురిలో ఏ ఒక్కరూ కూడా సదరు నేరము జరిగిన ప్రదేశంలో ఉన్నట్లుగా ఆనవాళ్లు లభించలేదని.

అంతేకాకుండా ఇంకెవరైనా ఆ సమయంలో అక్కడ వున్నారా అన్న అనుమానం మేరకు అక్కడ టవర్ డంప్ డేటా తీసి సుమారు 1400 ఫోన్ నంబర్లను ఆరా తీసి ఎవరూ లేరని నిర్ధారించుకోవడం జరిగిందాని తెలిపారు,. అందరూ భావించినట్టు భవ్య శ్రీ ది హత్య కాదని ఆత్మహత్య చేసుకున్నదని స్పష్టం చేస్తూ ఆత్మహత్యకు కారణాలపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతుందని కూడా ఎస్ పి రిషాంత్ రెడ్డి స్పష్టం చేశారు., దీంతో దాదాపు నెలరోజులుగా పలురకాల ప్రచారాలతో సంచలనం సృష్టించిన భవ్యశ్రీ అనుమానాస్పద కేసు కొలిక్కి వచ్చినట్టయింది

Advertisement

తాజా వార్తలు

Advertisement