Saturday, May 18, 2024

ఇండియాలో బిజీఎంఐ బ్యాన్.. చైనాతో లింకులే కార‌ణ‌మా..!?

మెబైల్ గేమ‌ర్స్ కు బ్యాడ్ న్చూస్.. బ్యాటిల్‌గ్రౌండ్ మొబైల్ ఇండియాను ఇండియాలో నిషేధించారు. 2020లో PUBG మొబైల్ నిషేధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇదే కాన్సెప్ట్‌తో BGMI 2021లో భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ యాప్‌ను కూడా నిషేదించారు. BGMI తొలగింపు వెనుక అధికారిక కారణం ఇప్పటికీ స్పష్టంగా లేదు. దక్షిణ కొరియాకు చెందిన క్రాఫ్టన్ కంపెనీకి అనుబంధ సంస్థ అయిన BGMIకు చైనాకు చెందిన PUBG కంపెనీ సపోర్ట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే PUBGని ఇండియాలో నిషేధించగా తాజాగా BGMIకు బ్యాన్ చేశారు.

భారత్‌లో BGMI నిషేధించినట్లు పలు మీడియా సంస్థలునివేదించాయి. ఎటువంటి ముందస్తు నోటిఫికేషన్ లేకుండానే Google Play Store, App Store నుండి Battlegrounds Mobile India యాప్ తొలగించారు. PUBG మొబైల్ ఇండియా, గారెనా ఫ్రీ ఫైర్ వంటి గేమ్‌ల వల్ల దేశ భద్రత ముప్పు వాటిల్లుతుందని నిఘా వర్గాలు హెచ్చరిక కారణంగా ఇటీవల ఈ గెమ్‌లను నిషేధించారు. చైనా మూలాలు ఉన్న సంస్థల ద్వారా దేశ భద్రతపై ప్రభావం చూపుతాయనే ఆందోళనల కారణంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నారు. ఇది BGMI ప్లేయర్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇక నుండి Google Play Store లేదా App Store నుండి BGMI యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోలేరు. అయితే, మీరు ఇప్పటికే మీ స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉంటే, ఎలాంటి అటంకం లేకుండా గేమ్‌ను ఆడవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement