Thursday, February 29, 2024

సౌదీ వెళుతున్న బిచ్చగాళ్లు అరెస్టు.. పాక్‌ ఎయిర్‌పోర్టులో ఘటన

ఉమ్రా యాత్రికుల ముసుగులో విదేశాల్లో భిక్షాటన చేయడానికి ముల్తాన్‌ విమానాశ్రయంలో సౌదీ అరేబియా విమానం ఎక్కిన 16 మంది బిచ్చగాళ్లను పాకిస్తాన్‌కు చెందిన ఫెడరల్‌ దర్యాప్తు ఏజెన్సీ(ఎఫ్‌ఐఏ) అదుపులోకి తీసుకుంది. వారిలో ఒక చిన్నారి, 11 మంది మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారని ఎఫ్‌ఐఏ వర్గాలు తెలిపాయి. బిచ్చమెత్తగా వచ్చిన ఆదాయంలో సగ భాగాన్ని తమకు సహకరించిన ట్రావెల్‌ ఏజెంట్లకు తాము ఇవ్వాల్సి ఉంటుందని విచారణ సందర్భంగా వారు తెలిపారని వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement