Friday, May 3, 2024

AP | దుర్గ గుడి ఈవోగా ఎం. శ్రీనివాస్ నియామకం.. భ్రమరాంబని తప్పించిన ప్రభుత్వం!

ఇంద్రకీలాద్రి, (ప్రభ న్యూస్) : ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న దుర్గగుడి ఈవో భ్రమరాంబను రాష్ట్ర ప్రభుత్వం త‌ప్పించింది. ఆ ప్లేసులో తాజాగా ఎం శ్రీనివాసును దుర్గ గుడి ఈ ఓ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గడిచిన రెండు సంవత్సరాల కాలంలో అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కుంటుప‌డింద‌ని, ఇంజనీరింగ్ పనులలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఈ ఓ భ్రమరాంబపై విమర్శలు వచ్చాయి. సామాన్య భక్తులు పట్ల చిన్నచూపు చూస్తూ సుమారు 100 కోట్ల పెట్టి నిర్మించిన ఏడంతస్తుల మహా మండపం, రెండు ఫ్లోర్ లో మళ్లీ ఓ పక్క భాగం కూల్చేందుకు నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వచ్చాయి.

దేవాదాయ శాఖ అధికారుల పేరు చెప్పుకొని కోట్ల రూపాయలను ఆలయం నుంచి ఖర్చు పెట్టడం జరిగిందని కూడా భ్ర‌మ‌రాంబ‌పై ఆరోపణలున్నాయి. భక్తులకు లడ్డు ప్రసాదాలు అందించే నాణ్యమైన నెయ్యిని సరఫరా చేయకపోగా నాసిరికమైన నెయ్యిని కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసేందుకు కార్యాలయం పేరు చెప్పుకొని కమిషనర్ తీసుకున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఇలాంటి అనేక ఆరోపణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భ్ర‌మ‌రాంబ‌ను మార్చి, కొత్త ఈవోగా శ్రీ‌నివాస్‌ను నియ‌మించ‌డంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement