Thursday, May 9, 2024

Asia Cup | టోర్నమెంట్ నుండి తప్పుకున్న బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ లిట్టన్ దాస్

బంగ్లాదేశ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ లిటన్ దాస్ హసా 2023 ఆసియా కప్‌కు దూరంగా ఉన్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) బుధవారం తెలిపింది. బంగ్లాదేశ్ ప్రారంభ మ్యాచ్ కోసం శ్రీలంకకు వెళ్లడానికి సిద్దంగా ఉండ‌గా.. దాస్ వైరల్ జ్వరంతో ఇబ్బంది ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. అతని స్థానంలో వికెట్ కీపర్-బ్యాటర్ అనముల్ హక్ బిజోయ్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పంపుతున్న‌ట్టు వెల్ల‌డించింది. బిజోయ్ తన దేశం కోసం 44 వన్డే ఇంటర్నేషనల్స్ (ODI) ఆడి 1200 పైగా పరుగులు చేశాడు.

బంగ్లాదేశ్ జట్టు

షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హుస్సేన్ ధృబో, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, నసుమ్ అహ్మద్, షక్ మహ్మద్, షక్ మహ్మద్ తాంజిద్ హసన్ తమీమ్, తంజిమ్ హసన్ సాకిబ్, అనముల్ హక్ బిజోయ్

Advertisement

తాజా వార్తలు

Advertisement