Thursday, April 25, 2024

ప‌వ‌న్ క‌ల్యాణ్ కి అడ్డుగా ఉండ‌కూడ‌ద‌ని ప‌క్క‌కు వ‌చ్చేశా.. బండ్ల గ‌ణేశ్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌న్ను ప‌క్క‌న పెట్టాడ‌ని అంటున్నారు.. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. నేనే ఆయన మార్గానికి అడ్డుగా ఉండకూడదని భావించి పక్కకి వచ్చేశాను అన్నారు నిర్మాత‌..న‌టుడు బండ్ల గ‌ణేశ్. సినిమాలకి సంబంధించి పవన్ వెనుక ఉంటాను .. రాజకీయాలకు సంబంధించి మాత్రం పవన్ వెనుక వెళ్లనని అనుకోవడం తప్పు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ ముందున్న లక్ష్యం వేరు. అందువలన పక్కకి వచ్చేశాను. వేరే కారణాలు చెప్పేసి తప్పించుకోవాలసిన అవసరం నాకు లేదు. పవన్ నాకు దేవుడే .. దేవుడు పూజ మందిరంలో పవిత్రంగా ఉన్నట్టే ఆయన కూడా ఉంటాడు అని చెప్పారు.పవన్ కల్యాణ్ ని నేను దేవుడిలా భావిస్తాను. కానీ మా అమ్మా నాన్నల కంటే మీరే ఎక్కువ .. నా భార్య బిడ్దల కంటే మీరే ఎక్కువ అని అనలేను. ఎందుకంటే అంతరాత్మకి వ్యతిరేకంగా నేను వెళ్లను. ఒక వ్యక్తిని తల్లిదండ్రులకంటే .. భార్య బిడ్డలకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని ఎవరు చెప్పినా అది అబద్ధమే అవుతుంద‌న్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement