Monday, May 6, 2024

క్రిప్టోకరెన్సీపై నిషేధం యోచన : నిర్మలాసీతారామన్‌

క్రిప్టోకరెన్సీపౌ నిషేధం విధించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భావిస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ సోమవారం నాడు లోక్‌సభలో చెప్పారు. నిషేధం విధిస్తే దీన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ప్రపంచ దేశాల సహాకారం తీసుకుంటామని చెప్పారు. క్రిప్టో కరెన్సీకి ఎల్లలు లేవని, దీనిపై నియంత్రణ, నిషేధం ఏదైనా అంతర్జాతీయ సహకారం లేకుండా అమలు చేయడం సులభం కాదని చెప్పారు. ఈ విషయంలో ఆర్బీఐ పదే పదే డిజిటల్‌ కరెన్సీ విషయంలో హెచ్చరించిందని ఆర్థిక మంత్రి వివరించారు. ఈ కరెన్సీ దేశ అర్థిక వ్యవస్థను ,ద్రావ్య నియంత్రణను విఘాతం కల్గిస్తుందని హెచ్చరించారు. ఈ కరెెన్సీ వల్ల ఆర్థిక వ్యవస్థకు కలిగే చేటును దృష్టిలో పెట్టుకుని , క్రిప్టో కరెన్సీని నిషేధిస్తూ చట్టం చేయాలని ఆర్బీఐ సూచించిందని నిర్మలాసీతారామన్‌ తెలిపారు . మన ఆర్థిక వ్యవస్థకు క్రి ఎn్టో కరెన్సీ వల్ల కలిగే నష్టం గురించి ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసిందని చెప్పారు. క్రిప్టోకరెన్సీ కరెన్సీ కాదని, ఏదైనా కరెన్సీని ఆయా దేశాల కేంద్ర బ్యాంక్‌లు, ప్రభుత్వాలు మాత్రమే జారీ చేస్తాయని ఆర్బీఐ తెలిపింది. క్రిప్టోకరెన్సీకి ఒక రూపంలేదని, ఇది పూర్తిగా డిజిటల్‌ కరెన్సీ మాత్రమేనని, దీన్ని ఏ దేశం , లేదా సెంట్రల్‌ బ్యాంక్‌లు చలమణిలోకి తీసుకు రాలేదని ఆర్బీఐ తన అభ్యంతరాల్లో తెలిపింది.

చట్ట బద్ద కరెన్సీకి విలువ ఉంటుందని, దాన్ని ద్రవ్య నియంత్రణ విధానం ద్వారా నిర్ధారిస్తారని ఆర్థిక మంత్రి లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీ పూర్తిగా ఊహగానాలపై, అంనాలపై నడుస్తుందని, అధిక రాబడి వస్తుందన్న వార్తలతో దీని విలువలో హెచ్చు తగ్గులు ఉంటాయని తెలిపారు. దీని ప్రభావం వల్ల ద్రవ్య నింయత్రణ, ద్రవ్య విధానం ప్రభావితం అవుతాయని, అస్థిరత ఏర్పడుతుందని చెప్పారు. క్రిప్టో కరెన్సీనై నిషేధం, నియంత్రణ విధించినప్పటికీ, దాన్ని అమలు చేయాలంటే అంతర్జాతీయంగా సహకారం అవసరం ఉందన్నారు. క్రిఎn్టో కరెన్సీ వల్ల లాభనష్టాలను వివరించడం ద్వారా ఈ సహకారాన్ని పొందాల్సి ఉంటుంది. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడుతున్న వారిని ఆర్బీఐ 2013 నుంచే హెచ్చరిస్తోంది. ఈ కరెన్సీ చట్టబద్దత, స్థిరత్వం, లాభనష్టాలు, కస్టమర్ల రక్షణ ఇలా అనేక అంశాల్లో ఆర్బీఐ హెచ్చరిస్తూ వస్తోందని ఆర్థిక మంత్రి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement