Friday, May 3, 2024

వంట నూనెల ధర తగ్గించిన అదానీ కంపెనీ..

ఫార్చూన్‌ బ్రాండ్‌పై మార్కెట్‌లో వంటనూనెలు విక్రయించే అదానీ కంపెనీ విల్మర్‌ తమ ఉత్పత్తులపై ధరలు తగ్గించింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గినందున ఈ మేరకు వినియోగదారులకు ఊరట కల్పించాలని వారం రోజుల క్రితం కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ అన్ని కంపెనీలను కోరింది. తగ్గిన ధరలు వినియోగదారుడికి బదలీ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అదానీకి చెందిన అదానీ మిల్మర్‌ కంపెనీ ఫార్చూన్‌ బ్రాండ్‌తో అమ్ముతున్న వంటనూనెలు ప్రధానంగా సోయాబీన్‌, ఫామ్‌ ఆయిల్‌ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

పామోలిన్‌ ఆయిల్‌ లీటర్‌ ధర 170 రూపాయిల నుంచి 144కు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
సోయాబీన్‌ ఆయిల్‌ ధరను 195 నుంచి 165కు తగ్గించారు.
సన్‌ ప్లవర్‌ ఆయిల్‌ను 210 నుంచి 199కి తగ్గింపు
ఆవనూనె ధరను 195 నుంచి 190 తగ్గింపు
రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ను 225 నుంచి 210కి తగ్గింపు
వేరు శనగ నూనెను 220 నుంచి 210కి తగ్గింపు
రాగ్‌ పేరుతో విక్రయించే వనస్పతి ధరను 200 నుంచి 185కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
తగ్గింపు ధరలు ప్రకటించిన స్టాక్‌ త్వరలోనే మార్కెట్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది.
ప్రపంచ మార్కెట్‌లో వంటనూనెలల ధరలు తగ్గడంతో ఈ ప్రయోజనాన్ని తాము వినియోగదారులకు అందించాలనే ధరలు తగ్గించినట్లు అదానీ విల్మర్‌ కంపెనీ ఎండీ , సీఈవో అదానీ విల్మర్‌ తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మరికొన్ని కంపెనీలు కూడా వంటనూనెలల ధరలను తగ్గించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement