Friday, March 29, 2024

ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. నా ఆరోగ్యం బాగోలేదు.. పున‌ర్న‌వి భూపాలం

యంగ్ న‌టి పున‌ర్న‌వి భూపాలం త‌న ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ చెప్పింది. తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు ప్రకటించింది. కొన్ని రోజులుగా తాను ఊపిరితిత్తుల సమస్యలతో బాధ పడుతున్నట్టు ఆమె తెలిపింది. కొత్త సంవత్సరాన్ని అనారోగ్యంతో ప్రారంభిస్తున్నానని బాధాకరమైన విషయాన్ని వెల్లడించింది. తాను అనారోగ్యం బారిన పడటం ఇదే చివరి సారి కావాలని భగవంతుడిని కోరుకుంటున్నానని తెలిపింది. సోషల్ మీడియాలో ఈ మేరకు ఆమె పెట్టిన మెసేజ్ ఆమె అభిమానులను బాధకు గురి చేస్తోంది. ఆమె త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షిస్తున్నారు. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న పున‌ర్న‌వి… బిగ్ బాస్ షో ద్వారా వారికి మరింత దగ్గరయింది. బిగ్ బాస్ లో ప్రేక్షకాభిమానం పొందినప్పటికీ ఆ తర్వాత ఆమెకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. చిన్న సినిమాల్లో మాత్రం ఆమె కనిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement