Thursday, May 2, 2024

Latest | ప‌వ‌న్ ఫాద‌ర్‌గా బ‌చ్చ‌న్ సాబ్‌.. ఓజీ నుంచి లేటెస్ట్ అప్‌డేట్ ఇదే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో యువ దర్శకుడు సుజీత్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ఓజీ. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిరాటంకంగా జరుగుతోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్‌గా క‌నిపించ‌నున్నారు. ఇప్పుడు, ఇన్‌సైడ్ రిపోర్ట్స్ ప్రాకారం, బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ పవన్ కళ్యాణ్ తండ్రిగా నటించడానికి OG టీమ్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రిగా పవర్ ఫుల్ క్యారెక్టర్ ఉంటుందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ను చిత్ర నిర్మాతలు సంప్రదించినట్లు సమాచారం. మ‌రి బచ్చన్ సాబ్ ఈ రోల్ కు అంగీకరించాడా లేదా అనేది అతి త్వరలో తెలుస్తుంది. ఈ మనోహరమైన కాంబినేషన్ కచ్చితంగా అభిమానులను అలరిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

- Advertisement -

ఇక పోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల నేపథ్యంలో వారాహి విజయ యాత్రలో తన రాజకీయ ప్రచారంలో బిజీగా ఉన్నారు. కాగా, సినిమాలో అతను లేని కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీపై కూడా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆగస్ట్‌లో మరో 15 రోజులు డేట్స్ కేటాయిస్తే.. ఆయన పార్ట్ మొత్తం పూర్తవుతుందని స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement