Wednesday, May 15, 2024

ఆజాదీకా అమృతోత్స‌వ్ – టీఎస్ ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్స్

ఆగ‌స్టు 15న జ‌న్మించే చిన్నారులంద‌రికి వారికి 12 ఏళ్లు వచ్చే వరకు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది తెలంగాణ ఆర్టీసీ. 75 ఏళ్లు పూర్తి చేసుకున్న పెద్ద వయస్కులకు ఈ నెల 15న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించ‌వ‌చ్చ‌ని తెలిపింది. టీ24 బస్ టికెట్ ను ఆగస్టు 15న రూ.75కు మాత్రమే అమ్ముతామన్నారు.
విడి రోజుల్లో ఈ టికెట్ ధర రూ.120 కావటం గమనార్హం. నేటి నుంచే అంటే మంగళవారం నుంచి ఆర్టీసీకి చెందిన అన్ని ప్రాంతాల్లో ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు జాతీయ గీతాన్ని అలపిస్తాం. ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు అన్ని బస్సులకు జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేస్తాం. ఆర్టీసీ ఉద్యోగులంతా అమ్రతోత్సవ్ బ్యాడ్జీలతోనే విధులకు హాజరు కావాల్సి ఉంటుంద‌న్నారు.

ఆగస్టు 15న ఆర్టీసీ కార్గోలో ఒక కేజీ పార్సిల్ ను 75 కిలో మీటర్ల పాటు ఉచితంగా రవాణా చేస్తామన్నారు. టాప్ 75 ప్రయాణికులకు ఒక ట్రిప్ టికెట్ ఉచితమని.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఆగస్టు 15న పుష్పక్ ఎయిర్ పోర్టు సర్వీస్ ను వినియోగించుకునే ప్రయాణికులు 75 శాతం ఛార్జీ చెల్లిస్తే సరిపోతుంది. 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో ఆగస్టు 15 నుంచి 22 వరకు ఉచిత వైద్య పరీక్షలతో పాటు.. 75 ఏళ్ల లోపు వారికి రూ.750లతో వైద్య పరీక్షల ప్యాకేజీని ఏర్పాటు చేశారు. టీటీడీ ప్యాకేజీని వినియోగించుకొని ప్రయాణికులకు ఈ నెల 16 నుంచి 21 వరకు రూ.75 తగ్గిస్తామని పేర్కొన్నారు. ఇలా ప‌లు ఆఫ‌ర్ల‌ని ప్ర‌క‌టించింది టిఎస్ ఆర్టీసీ.స‌జ్జ‌నార్ ఆర్టీసీ ఎండీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుండి ఆర్టీసీని లాభాల బాట‌లో ప‌య‌నించేలా ప‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement