Monday, April 29, 2024

అవసరాల శ్రీనివాస్ ‘101 జిల్లాల అందగాడు’ ట్రైలర్ విడుదల

అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించిన ‘ 101 జిల్లాల అందగాడు’ అనే సినిమా ట్రైలర్‌ను బుధవారం ఉదయం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో అవ‌స‌రాల శ్రీనివాస్ బ‌ట్ట‌త‌ల‌తో కనిపించే గొత్తి సత్యనారాయణగా కనిపించనున్నాడు. బట్టతల క‌వ‌ర్ చేసుకోవ‌డానికి అతడు ఎన్ని ఇబ్బందులు ప‌డ్డాడో ఆస‌క్తిగా చూపించారు. బ‌ట్ట‌త‌ల వ‌ల‌్ల హీరో కొన్ని సంద‌ర్భాల‌లో ఎమోష‌న్, ఫ్ర‌స్ట్రేట్‌ కూడా అయ్యాడు. ఈ ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి.

ఈ సినిమాతో రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. చిలసౌ మూవీ ఫేమ్ రుహానీ శర్మ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ స‌మ‌ర్పణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్లమూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఈ ఫస్ట్‏లుక్ పోస్టర్‏, టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement