Thursday, October 10, 2024

Sports | రేప‌టి నుంచి ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌.. టైటిల్‌ కోసం సింధూ, శ్రీ‌కాంత్ త‌హ‌త‌హ‌

ఆగస్ట్ 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 BWF సూపర్‌లో.. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు తన ఫామ్‌ను మళ్లీ ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, భారత బ్యాడ్మింటన్ ప్లేయ‌ర్‌ లక్ష్య సేన్ 500 టోర్నమెంట్‌లో తన పర్పుల్ ప్యాచ్‌ను పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ సీజన్‌లో అత్యుత్తమ ఫామ్‌లో లేని స్టార్ ఇండియన్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ రేపు (మంగళవారం) జ‌ర‌గ‌నున్న‌ ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో విజ‌యంతో టైటిల్ కరువును తీర్చుకోవాల‌ని చూస్తున్నారు. అయితే, డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జరగనున్న వ‌ర‌ల్డ్ ఛాంపియన్‌షిప్ కి ముందు తమ ఫామ్‌ని తిరిగి పొందేందుకు ఇదే చివరి అవకాశంగా అన‌లిస్టులు చెబుతున్నారు.

2019 ప్రపంచ ఛాంపియన్, పివి సింధు గాయం నుండి కోలుకున్నప్పటి నుండి ఆమె మెరుగైన ఆట‌తీరు ప్ర‌ద‌ర్శించ‌డం లేదు. దీంతో ఈ సంవత్సరం ఆడిన 12 టోర్నమెంట్లలో ఏడు టోర్నమెంట్లు మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించింది. ఇక‌.. కిదాంబి శ్రీకాంత్ కూడా వారం రోజులుగా వరుస విజయాలు అందుకోలేకపోయాడు. అతను జపాన్ ఓపెన్‌లో తన ట్రేడ్‌మార్క్ అటాకింగ్ గేమ్‌తో చైనీస్ తైపీకి చెందిన చౌ టియెన్ చెన్‌ను ఓడించిన‌ప్ప‌టికీ, తన తోటి భారతీయుడు HS ప్రణయ్ చేతిలో ఓడిపోయాడు.

- Advertisement -

కాగా, భారతదేశం తరఫున, హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్.. ప్రపంచ నంబర్ 2 జోడీ అయిన‌ సాత్విక్‌-చిరాగ్ ఈ సీజన్‌లో అత్యంత నిలకడగా రాణిస్తున్నారు. ఆగస్టు 21 నుండి 27 వరకు జ‌ర‌గ‌నున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు ప్రిపేర్ కావడానికి సాత్విక్-చిరాగ్ జోడీ ఆస్ట్రేలియా ఓపెన్‌ను స్కిప్ చేయాల‌ని నిర్ణయించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement