Saturday, May 4, 2024

టీనేజర్లకు బూస్టర్​ డోస్​.. ఫైజర్​ వ్యాక్సిన్​కి పర్మిషన్​ ఇచ్చిన ఆస్ట్రేలియా..

ఆస్ట్రేలియా డ్రగ్స్​ రెగ్యులేటరీ విభాగం ఆ దేశానికి గుడ్​ న్యూస్​ చెప్పింది. కరోనా వైరస్ Omicron వేరియంట్ నుండి వచ్చే ముప్పును తగ్గించడానికి బూస్టర్​ డోస్​ను అందించేందుకు ఆమోదించింది. ఆ దేశంలోని 16, 17 ఏళ్ల యుక్త వయస్సు వారిని కాపాడేందుకు మూడో  డోస్‌లను తప్పకుండా తీసుకోవాని అధికారులు ప్రజలను కోరుతున్నారు.

ఈ క్రమంలో 16,  17 ఏళ్ల వయస్సు గల వారికి కొవిడ్ -19 వ్యాక్సిన్ బూస్టర్ షాట్‌ల వినియోగాన్ని ఆస్ట్రేలియా డ్రగ్ రెగ్యులేటర్ ఆమోదించింది. థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ (TGA) యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ , బ్రిటన్‌లలో ఉన్న 16, -17 ఏళ్ల యువకులలో బూస్టర్‌గా ఉపయోగించడానికి ఫైజర్స్ (PFE.N) వ్యాక్సిన్‌ను ఆమోదించినట్టు అక్కడి అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement