Friday, June 14, 2024

టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి.. అసలు కారణం ఏటంటే..?

తమిళనాడులోని ఓ ప్రైవేటు లా కాలేజీకి చెందిన విద్యార్థులు కారులో తిరుమల దర్శనానికి తిరుపతికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఏపీ సరిహద్దుల్లోని ఎస్వీ పురం టోల్‌ ప్లాజా వద్ద అక్కడి సిబ్బంది ఆపారు. ఈ క్రమంలో వారికారుకు ఉన్న ఫాస్టాగ్‌ పనిచేయకపోవడంతో టోల్‌ ప్లాజా సిబ్బంది డబ్బు చెల్లించాలని, కారు పక్కకు తీస్తే మిగతా వాహనాలు వెళ్తాయని సుచించారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపటికి ఆదికాస్తా అదికాస్తా గొడవకు దారితీయడంతో.. విద్యార్థులు టోల్‌గేట్‌ సిబ్బందిపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement