Monday, April 29, 2024

Mexico: క్రిస్మ‌స్ వేడుక‌ల్లో దారుణం…దుండగుడి కాల్పుల్లో 16 మంది మృతి

మెక్సికోలో క్రిస్మ‌స్ వేడుక‌ల్లో కాల్పుల మోత మోగింది. గువానాజువాటో రాష్ట్రంలోని సాల్వాటియెర్రా పట్టణంలో క్రిస్మస్ సీజన్ పార్టీ నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తున్నవారిపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో 16 మంది మృత్యువాతపడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ‘పోసాడా’ అని పిలిచే క్రిస్మస్ పార్టీ తర్వాత ఈవెంట్ హాల్ నుంచి జనాలు బయటకు వస్తున్న సమయంలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement