Thursday, February 22, 2024

Breaking: ఇద్దరు బిల్డర్ల రూ.415కోట్ల ఆస్తులు సీజ్

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ఇద్ద‌రు బిల్డ‌ర్ల‌కు చెందిన సుమారు రూ.415 కోట్ల ఆస్తుల్ని సీజ్ చేసింది. ఎస్ బ్యాంక్‌-డీహెచ్ఎఫ్ఎల్ కేసులో ఆ ఇద్ద‌రూ నిందితులుగా ఉన్నారు. రేడియ‌స్ డెవ‌ల‌ప‌ర్స్ సంస్థ ఓన‌ర్‌ సంజ‌య్ ఛాబ్రియాకు చెందిన 251 కోట్ల ఆస్తుల్ని, ఏబీఐఎల్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఓన‌ర్‌ అవినాశ్ భోంస్లేకు చెందిన 164 కోట్ల ఆస్తుల్ని ఈడీ సీజ్ చేసింది. మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఈ ఆస్తుల్ని జ‌ప్తు చేశారు. సంజ‌య్ ఛాబ్రియా, అవినాశ్ భాంస్లేలు బ్యాంకుల‌కు సుమారు 34 వేల కోట్లు టోక‌రా వేసిన‌ట్లు తెలిసింది. ఇప్ప‌టి వర‌కు ఈ కేసులో మొత్తం అటాచ్ చేసిన ఆస్తుల విలువ సుమారు రూ.1827 కోట్లు ఉంటుంద‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ పేర్కొన్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement