Sunday, December 5, 2021

అస‌త్య వేదిక‌గా అసెంబ్లీ..జ‌గ‌న్ తుగ్ల‌క్ 3.0..నారా లోకేష్..

ఏపీ సీఎం జ‌గ‌న్ తుగ్ల‌క్ 3.0అని, మూర్ఖుడు మారాల‌నుకోవ‌డం అత్యాశేన‌ని అన్నారు టిడిపి పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్..అసెంబ్లీ ని అసత్య వేదికగా మార్చేశారని అన్నారు. ఇల్లు ఇక్కడే కట్టా, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి.. మూడు రాజధానుల కోసం ప్రజలు తీర్పు ఇచ్చారనడం హైలైట్ అని మండిప‌డ్డారు. మురుగు బుర్రలకి మెరుగైన ఆలోచనలు రావడం ఎప్పటికీ జరగని పని అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఈ వ్యాఖ్యలకు జగన్‌ గతంలో మాట్లాడిన వీడియోను కూడా జత చేశారు నారా లోకేష్‌. కాగా.. ఇవాళ మూడు రాజధానుల బిల్లు ను జగన్‌ సర్కార్‌ వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News