Wednesday, April 24, 2024

ఐటీ, ఫార్మా రంగాల్లో తెలంగాణ టాప్.. అన్ని రంగాల్లోనూ నెంబర్ 1

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్ : జీఎస్‌డీపీ పరంగా తెలంగాణ ఏడో పెద్ద రాష్ట్రంగా వెలుగొందింది. ఐటీ, ఫార్మారంగంలో జాతీయ స్థాయిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నది. గత ఆర్ధిక యేడాది రూ. 1,45,522కోట్ల ఐటీ ఎగుమతులతో 12.88శాతం వృద్ధిరేటుతో 6,28,615 మందికి ఉపాధి కల్పించింది. ఉద్యోగ కల్పనలో ఇది అంతక్రితపు ఏడాదికంటే 7.99శాతం అధికం కావడం గమనార్హం. ఆర్ధికంనుంచి సేవలు, పర్యాటకం, ఐటీ, ఎగుమతులు, వ్యవసాయం వరకు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నిల్చింది. 2015-16 ఆర్ధిక యేడాదినుంచి వార్షిక వృద్ధిరేటు ఏనాడూ తగ్గకుండా 9శాతం కంటే ఎక్కువగా నమోదు చేసుకుంటోంది.

రాష్ట్ర దేశీయోత్పత్తిలో సేవారంగం వాటా 60శాతంగా, వ్యవసాయరంగంలో ఉపాధి వాటా పెరుగుదల నమోదైంది. జీఎస్‌డీపీలో వ్యవసాయరంగం వాటా 16శాతం ఉండగా, ఇందులో 86శాతం చిన్న, సన్నకారు రైతులున్నారు. పారిశ్రామిక రంగం వాటా జీఎస్‌డిపీలో 17శాతంగా ఉంది. పారిశ్రామిక రంగంలో రాష్ట్రం ఫార్మా, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, హైటెక్‌ రంగాలు, టెక్స్‌టైల్స్‌, లెదర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, మినరల్స్‌ వంటివన్నీ కలుపుకొని ఉన్నాయి.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement