Tuesday, May 14, 2024

Telangana : 8 మెడికల్‌ కాలేజీల ప్రారంభానికి ఏర్పాట్లు.. ఒకే రోజు వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించనున్న కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వైద్య విద్యలో విప్లవాత్మకమైన అడుగును రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వేయనుంది. ఈ ఒక్క విద్యా సంవత్సరం (2022-23)లోనే 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 4080 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలేజీలను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది నీట్‌ -2022కు అర్హత సాధించిన విద్యార్థులకు ఈ కళాశాలల్లో వైద్య విద్యా బోధన ప్రారంభం కానుంది. సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, రామగుండం జిల్లాల్లో కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి.

ఇప్పటికే ఆయా జిల్లాల్లోని ఆసుపత్రులను అప్‌గ్రేడ్‌ చేసి మెడికల్‌ కాలేజీలకు అనుసంధానం చేశారు. ఈ ఎనిమిది మెడికల్‌ కాలేజీల ప్రారంభ ంతో ఈ విద్యా సంవత్సరంలో 1150 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 2014లో తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 850 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా.. 2022 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలతో ఆ సంఖ్య 2091కి చేరింది.

వీటితోపాటు ప్రయివేటు మెడికల్‌ కాలేజీల్లోనూ 85శాతం బీ కేటగిరీ మెడికల్‌ సీట్లను విద్యార్థులకు అందించాలని రాష్ట్ర ప్ర భుత్వం ఇప్పటికే విధానపరమైన నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రయివేటు మెడికల్‌ కాలేజీల్లోనూ 1068 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement