Thursday, October 10, 2024

రికార్డు స్థాయిలో అప్పన్న హుండీ ఆదాయం.. 40 రోజులకు 2.06 కోట్లు ఆదాయం

విశాఖప ట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో ; దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా పెద్ద మొత్తం ఆదాయం లభించింది. ఆలయ ఈవో వి.త్రినాధరావు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఆలయ అధికారులు, సిబ్బంది హుండీలు తెరిచి లె క్కించారు. 40 రోజులకు సంబంధించి 14 హుండీలు తెరిచి లెక్కించగా, నగదు రూపంలో రూ.2,06,11,210 ఆదాయం లభించింది.

వీటితో పాటు బంగారం, వెండి కానుకలుతో పాటు విదేశీయ డాలర్లు పెద్ద మొత్తంలో భక్తులు సమర్పించారు. ఇటీవల కాలంలో సింహాద్రినాధుడు ఆలయానికి దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆయా విభాగాల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement