Sunday, May 5, 2024

మూడు హెచ్‌ఐఎంఎస్‌ఎస్‌ స్టేజ్‌ 6 సర్టిఫికేషన్‌లను అందుకున్న అపోలో హాస్పిటల్స్‌

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : డిజిటల్‌ ఇమేజింగ్‌ అడాప్షన్‌ మోడల్‌ (డిఐఎఎమ్‌), ఔట్‌ పేషెంట్‌ ఎలక్ట్రానిక్‌ మెడికల్‌ రికార్డ్‌ అడాప్షన్‌ మోడల్‌ (ఒ-ఇఎమ్‌ఆర్‌ఎఎమ్‌) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అడాప్షన్‌ మోడల్‌ (ఐఎన్‌ఎఫ్‌ఆర్‌ఎఎమ్‌) అనే మూడు హెచ్‌ఐఎమ్‌ఎసస్‌ఎస్‌ డిజిటల్‌ మెచ్యూరిటీ మోడల్స్‌లో అపోలో హాస్పిటల్స్‌ స్టేజ్‌ 6 అక్రిడిటేషన్‌లను సాధించిందని హెచ్‌ఐఎమ్‌ఎస్‌ఎస్‌ (హెల్త్‌కేర్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ సొసైటీ) సోమవారం ప్రకటించింది.

ఈసందర్భంగా అపోలో హాస్పిటల్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగీతా రెడ్డి మాట్లాడుతూ… ఇది కేవలం డిజిటల్‌ మద్దతు పరిపక్వతకు సంబంధించినది మాత్రమే కాదు, పరిష్కారాలను సమర్థవంతంగా స్వీకరించే నమూనా కూడా అని, తద్వారా సంస్థను సమర్ధవంతంగా నిర్వహించవచ్చన్నారు. హెచ్‌ఐఎమ్‌ఎస్‌ఎస్‌, ఆసియా-పసిఫిక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సైమన్‌ లిన్‌ మాట్లాడుతూ… అపోలో డిజిటల్‌ ఆరోగ్య సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో నిబద్ధత, స్థిరత్వాన్ని చూపుతూనే ఉందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement