Monday, April 29, 2024

AP – సైకిల్ పేదోడి చైతన్య రథం….. గ్లాస్ సామాన్యుడి వస్తువు – నారా లోకేష్

ఈ ఫ్యాన్ ఆత్మహత్యలకే.. చెత్త బుట్టలో పడేయండి
ఏపీలో 35 వేల మంది ఉరేసుకున్నారు
ఆయన వెండి గ్లాసులో తాగుతాడు
ఉద్యోగాలిస్తామని మోసం చేశాడు
నవరత్నాలు అనేది ఓ దగా
బాబు, పవన్ సూపర్ సిక్స్‌తో కష్టాలన్నీ తీరుతాయి
రెండు నెలలో ఈ బాధలు తీరుస్తాం
విశాఖ ఉత్తర శంఖారావంలో లోకేష్

(విశాఖపట్టణం బ్యూరో, ప్రభన్యూస్) “ రైతు ఆత్మహత్యలకు ఫ్యాన్ ఉపయోగపడింది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే 2వ స్థానం, రైతు ఆత్మహత్యల్లో 3 వ స్థానంలో రాష్ట్రం నిలిచింది. యువకులు ఆత్మహత్య చేసుకునేందుకు ఈ ఫ్యాన్ ఉపయోగపడుతోంది. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకునేందుకు ఈ ఫ్యాన్ ఉపయోగపడుతోంది.. చేనేత కార్మికులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ఈ ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోతున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో 35 వేల మంది ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయారు. అందుకే ఫ్యాన్ రెక్కలు విరిచి చెత్తబుట్టలో పడేయాలి” అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్అన్నారు. విశాఖపట్టణం ఉత్తర నియోజకవర్గంలో సోమవారం జరిగిన శంఖారావం సభలో సీఎం జగన్పైరెచ్చిపోయారు. ఈ సభలో లోకేష్మాట్లాడుతూ, సైకిల్, గ్లాస్, ఫ్యాన్ గురించి మాట్లాడారు.

సైకిల్‌, గ్లాసు విలువ పెత్తందారుల‌కు అర్థం కావు..

సైకిల్, గ్లాస్ విలువ పెత్తందారుకు అర్థంకాదు. సైకిల్ సామాన్యుడి చైతన్య రథం. గ్లాస్ లో సామాన్యుడు టీ తాగుతారు. జగన్ బంగారు, వెండి గ్లాస్ లో టీ తాగుతారేమో, ముఖ్యమంత్రి సభకు వెళితే చేసిన మంచి పనులు చెప్పుకుంటారు. ఈ ముఖ్యమంత్రి మాత్రం చంద్రబాబు పేరు జపం చేస్తున్నారు. గంట ప్రసంగంలో 100 సార్లు చంద్రబాబు పేరు పలికారు. దానిని బట్టి ఈయన పీకిందేమీ లేదని అర్థమవుతోంది. ఈ స్థితిలో ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. దీనిని చెత్తబుట్టలో పడేయటమే మంచిది. అని లోకేష్వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో విశాఖను జాబ్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా మారిస్తే జగన్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారని, మహిళలు ఒకసారి ఆలోచించాలని, ఒక్క విశాఖలోనే కాదు మా సొంత జిల్లా చిత్తూరులో కూడా గంజాయి మాఫియా ఉందని లోకేష్ వివరించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మాఫియాను పెంచి పోషిస్తున్నారని, . రెండు నెలలు ఓపిక పడితే అలాంటి వాళ్లపై ఉక్కుపాదం మోపి, గంజాయిని శాశ్వతంగా నిర్మూలిస్తామని , సింహాద్రి అప్పన్నస్వామి కొలువైన పుణ్యభూమి విశాఖ. జగన్ పదేపదే సిద్ధం అంటున్నారని, .

సిద్ధంగా లేమంటున్న వైసీపీ కార్య‌క‌ర్త‌లు..

నిన్న రాప్తాడుకు వెళితే వైసీపీ నాయకులు, కార్యకర్తలేమో తాము సిద్ధంగా లేమని చెబుతున్నారని, . ఏకంగా సభ తుస్సుమందని, ప్రజలు వెళ్లిపోతున్న సమయంలో అక్కడున్న మీడియా మిత్రుడు ఫోటోలు తీస్తుంటే ఉక్రోషంతో వైసీపీ రౌడీలు దాడి చేశారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, గ్రూప్-1,2 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి మోసం చేశారు. 6500కానిస్టేబుల్ భర్తీ చేస్తామని చెప్పారు. లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్ లు తీసుకుంటున్నారు. కానిస్టేబుల్ పరీక్ష కోచింగ్ కోసం 2 లక్షలు ఖర్చుపెట్టినట్లు ఓ తల్లి నాకు చెప్పిందని, . నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందని లోకేష్ ఆరోపించారు. మండుటెండలో సెల్ లో టార్చ్ లైట్ ఆన్ చేయాలని జగన్ కోరితే కార్యకర్తలు ఒకళ్ల మొహం ఒకరు చూసుకున్నారని, . జగన్ కు చిప్ దొబ్బిందా, రేచీకటి ఏమైనా ఉందా అని నవ్వుకున్నారని లోకేష్ ఎద్దెవ చేశారు.

- Advertisement -

న‌వ ర‌త్నాల పేరుతో మోసం..

నవరత్నాల పేరుతో నవ మోసాలు చేశారని. జలయజ్ఞం పేరు చెప్పి తట్టమట్టి కూడా వేయలేదని. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మహిళల ఓట్లు అడుగుతానని, . ఇప్పుడు బూమ్ బూమ్ దుకాణాలు పెట్టి మద్యం ఏరులై పారిస్తున్నారని, వై నాట్ 175 అంటున్నారు. నేను వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్, వైనాట్ పోలవరం, వైనాట్ జాబ్ కేలండర్, గ్రూప్-1,2 పోస్టులు, వైనాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం అంటున్నా.. వీటిపై సమాధానం చెప్పాలని లోకేష్ ప్రశ్నించారు. జనం పడుతున్న కష్టాలు చూసి బాబు-పవన్ కలిసి సూపర్ -6 హామీలు ప్రకటించారని, తొలి ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేం తీసుకుంటాం. ప్రతి డీఎస్సీ ఏర్పాటుచేస్తాం.

సూప‌ర్ సిక్స్‌తో అంద‌రినీ ఆదుకుంటాం..

పద్దతి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఉద్యోగం రాని వారికి అప్పటివరకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం.స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తాం, ఒక్కరుంటే రూ.15వేలు, ఇద్దరుంటే రూ.30వేలు, ముగ్గురుంటే ఏడాదికి రూ.45 వేలు మన ప్రభుత్వం ఇస్తుంది.రైతుల్ని ఆదుకునేందుకు ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తాం. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతోంది మన ప్రభుత్వం. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు ప్రతి నెల రూ.1,500 ఇస్తాం, ఏడాదికి రూ.18వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఆరో హామీ ఆర్టీసీ బస్సుల్లో తెలుగు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం అని లోకేష్ హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement