Sunday, April 28, 2024

AP | ఇంజనీరింగ్‌ ఫీజులు ఖరారు.. ఉత్తర్వులు విడుదల

అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని దాదాపు 220 ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజులను నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు విడుదల చేసింది. హైకోర్టు తీర్పుు అనుసరించి ఫీజులు నిర్ణయించారు. గత ఏడాదిలో వసూలు చేసిన ఫీజుకు 10 శాతం అదనంగా పెంచుకునేలా, అదీ కూడా కనీస ఫీజు 43 వేల రూపాయలకు మించకుండా ఫీజును నిర్ఱారించారు. కాలేజీ స్థాయిని బట్టి ఫీజు అత్యధికంగా 77 వేల రూపాయలు ఉండగా కనీసంగా 43 వేల రూపాయలుగా ఉంది.

మెరైన ఇంజనీరింగ్‌ను ప్రత్యేకంగా అం దిస్తున్న ప్రవీణా మెరైన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీకి మాత్రం లక్షా 37,500 రూపాయలను ఫీజుగా నిర్ణయించారు. కాగా ఈ ఫీజుల నిర్ధారణ కేవలం 2023-24 ఏడాదికి మాత్రమే. ఫీజులపై హైకోర్టు పూర్తి తీర్పు వచ్చిన తర్వాత ఫీ జుల నియంత్రణ మండలి నిర్ణయం మేరుకు ఆ తర్వాత కాలానికి ఫీజులు నిర్ణయించబడతాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ జీవోఎంఎస్‌ నెంబర్‌ 41ని విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement