Sunday, April 28, 2024

Deep Fake: అనుష్క శెట్టి డీప్ ఫేక్ సెగ‌…

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో అనుష్క శెట్టి ఒకరు. రీసెంట్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తో హిట్ అందుకుంది అనుష్క. ఇదిలా ఉంటే ఇప్పుడు అనుష్క శెట్టి తల్లి తండ్రులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. అందుకు కారణం డీప్ ఫేక్ వీడియోలు. అనుష్క ను అస‌భ్యంగా చూపిస్తూ ఈ వీడియోల‌ను విడుద‌ల చేశారు.

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది సైబర్ నేరగాళ్లు టెక్నాలజీ ఉపయోగించి హీరోయిన్స్ అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. రష్మిక మందన్న వీడియోలు వైరల్ అవ్వడంతో చాలా మంది దీని పై స్పందించారు. ఇలాంటి అసభ్యకరమైన వీడియోలు క్రియేట్ చేసేవారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా అనుష్క వీడియోలు , ఫోటోలు వెంట‌నే తొల‌గించాల‌ని కోరుతూ అనుష్క పేరేంట్స్ ఫోలీసులకు ఫిర్యాదు చేశారు.. వాటిని పోస్ట్ చేసిన వారిని, వైర‌ల్ చేస్తున్న వారిని వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement