Friday, April 26, 2024

శిల్ప క‌ళా వేదిక‌లో అంటే ..సుంద‌రానికీ – ప్రీ రిలీజ్ ఈవెంట్

అంటే సుంద‌రానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రేపు అంటే బుధ‌వారం సాయంత్రం 6గంట‌ల నుంచి హైద‌రాబాద్ లోని శిల్ప క‌ళా వేదిక‌లో జ‌ర‌గ‌నుంద‌ని మేక‌ర్స్ వెల్ల‌డించారు. నాని, న‌జ్రియా హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయా ద‌ర్శ‌కత్వం వ‌హించాడు. ఈ చిత్రంలో నాని బ్ర‌హ్మ‌ణుడి పాత్ర‌లో న‌టించ‌గా, న‌జ్రియా క్రిస్టియ‌న్ అమ్మాయిగా న‌టించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే చిత్రం నుంచి విడుద‌లైన టీజ‌ర్, ట్రైల‌ర్‌లు ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలను న‌మోదు చేశాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం జూన్ 10న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం తీరిక లేకుండా ప్ర‌మోష‌న్ల‌ను జ‌రుపుతుంది. ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా మేక‌ర్స్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డిస్తూ ప్రేక్ష‌కుల‌లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మేక‌ర్స్ బిగ్ అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement