Thursday, May 2, 2024

వాతావరణ మార్పులతో కరుగుతున్న అంటార్కిటికా.. 2023లో భారీ మంచుఫలకం మాయం

ఈ ఏడాది అంటార్కిటికాలో రికార్డు స్థాయిలో మంచు ఫలకలు కరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాస్తవానికి ప్రతి సంవత్సరం వేసవిలో అంటార్కిటికాలోని మంచు ఫిబ్రవరి చివరిలో కరుగుతుంది. శీతాకాలంలో తిరిగి గడ్డకడుతుంది. కానీ, ఈ సంవత్సరం శాస్త్రవేత్తలు అక్కడ పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. వాతావరణ సంక్షోభం అంటార్కిటికాను మరింత తీవ్రంగా ప్రభావితం చేసే సూచనలు ఉన్నాయని, దీనికంతటికి గ్లోబల్‌ వార్మింగ్‌ పెద్ద కారణమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

జూలై మధ్యలో, అంటార్కిటికా సముద్రపు మంచు 1981 నుండి 2010 సగటు కంటే 2.6 మిలియన్‌ చదరపు కిలోమీటర్లు (1 మిలియన్‌ చదరపు మైళ్ళు) తక్కువగా ఉంది. దీని విస్తీర్ణం అర్జెంటీనా, టెక్సాస్‌, కాలిఫోర్నియా, న్యూ మెక్సికో, అరిజోనా, నెవాడా, ఉటా, కొలరాడో దేశాల విస్తీర్ణంతో సమానంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ పరిణామాన్ని శాస్త్రవేత్తలు అసాధారణంగా పేర్కొన్నారు.

ఇది చాలా అరుదైనది. ఆశ్చర్యకరం ఏమిటింటే మిలియన్ల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇలా జరుగుతుంది అని యూనివర్శిటీ ఆఫ్‌ కొలరాడో బౌల్డర్‌లోని గ్లేషియాలజిస్ట్‌ టెడ్‌ స్కాంబోస్‌ పేర్కొన్నారు. గేమ్‌ మారింది. మంచు స్థితి మునుపటిలాలేదు. తీవ్రమైన అసమానత కనిపిస్తోంది అని వ్యాఖ్యానించారు. శాస్త్రవేత్తలు 2016 నుండి వేగంగా దిగజారుతున్న ధోరణిని గమనించడం ప్రారంభించారు. సహజ వాతావరణ వైవిధ్యం సముద్రపు మంచును ప్రభావితం చేస్తున్నప్పటికీ, చాలా మంది శాస్త్రవేత్తలు కనుమరుగవుతున్న మంచుకు వాతావరణ మార్పు ప్రధాన చోదకమని తేల్చారు.

- Advertisement -

‘అంటార్కిటిక్‌ వ్యవస్థ ఎల్లప్పుడూ చాలా వేరియబుల్‌. ప్రస్తుత వైవిధ్యం చాలా తీవ్రంగా ఉంది. గత రెండేళ్ళలో ఏదో సమూలంగా మారిపోయింది. ముఖ్యంగా ఈ సంవత్సరం మునుపటి సంవత్సరాలకు కంటే 45ఏళ్లు వెనక్కి వెళ్లింది” అని స్కాంబోస్‌ తెలిపారు. అయితే, సముద్రపు మంచు కరగడానికి కారణాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement