Saturday, March 2, 2024

భాగ్యనగరానికి మరో మణిహారం.. శిల్పా ఫ్లైఓవర్‌ ప్రారంభంచిన కేటీఆర్

హైదరాబాద్‌ మహానగరంలో మరో ఫ్లైఓవర్‌ ప్రారంభంచారు మంత్రి కె.టి.రామారావు. ఐటీ కారిడార్‌ను ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం చేస్తూ శిల్పా లే అవుట్‌ మొదటి దశ పైవంతెనను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ పైవంతెన నిర్మాణానికి దాదాపు రూ.250కోట్ల ఖర్చు అయినట్లు సమాచారం. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డిపి) కింద గత ఆరేళ్లలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పూర్తి చేసిన 17వ ప్రాజెక్ట్ ఇది.

హైటెక్ సిటీ – ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య మెరుగైన కనెక్టివిటీ..

శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ ట్రాఫిక్ నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా హైటెక్ సిటీ, హెచ్‌కెసి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది ఈ ఫ్లైఓవర్. ఈ వంతెన 823 మీటర్ల పొడవు, 16.6 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసల రోడ్డుతో నిర్మితమైంది. అంతే కాక శిల్పా లేఅవుట్ నుండి గచ్చిబౌలి జంక్షన్, ఔటర్ రింగ్ రోడ్ (ORR) వరకు ప్రయాణించే ప్రయాణికులకు ఈ ఫ్లైఓవర్ తో ప్రయాణ సులువు కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement