Thursday, April 25, 2024

కోడలు నయనతారని.. ప్రశంసలతో ముంచెత్తిన అత్త మీనా కుమారి

అత్తగారి దగ్గర మంచి మార్కులు కొట్టేసింది తమిళ స్టార్ హీరోయిన్ నయనతార. మా అబ్బాయి సక్సెస్ ఫుల్ డైరెక్టర్, కోడలు స్టార్ హీరోయిన్. ఇద్దరూ చాలా కష్టపడే తత్త్వంగలవారు. అలాగే నయనతార చాలా దయా హృదయం కలిగిన అమ్మాయి అని నయనతార అత్త మీనా కుమారి కొనియాడారు.. ఇంట్లో 8మంది వర్కర్స్ పనిచేస్తారు. వారిలో ఒకరు రూ. 4 లక్షల అప్పు తీర్చలేక ఇబ్బంది పడ్తున్న విషయం తెలిసి నయనతార… ఆ అప్పు తీర్చిందని తెలిపారు నయనతార అత్త మీనా కుమారి.

నయనతారకు ఇల్లును చక్కబెట్టడం, పెద్దవారి ఆలనా పాలనా, క్షేమం చూసుకోవడం బాగా తెలుసు. 10 మంది మనుషులు చేసే పని నయనతార ఒక్కతే చేస్తుంది. మేం మా పిల్లలకు కష్టపడటం నేర్పాం. నయనతార కూడా అలాగే కష్టపడటం తెలిసిన అమ్మాయి. నయనతార, విగ్నేష్ వారి వృత్తిని గౌరవిస్తారు. అందులో ఉన్నత స్థానం చేరుకునేందుకు కృషి చేస్తారు, అని విగ్నేష్ తల్లి మీడియాకు తెలియజేశారు అన్ని విధాలాఅనుకూలవతి కోడలిగా వచ్చినట్లు విగ్నేష్ తల్లి మురిసిపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement