Thursday, July 29, 2021

వ్యవసాయ శాఖలో మరో 1000 పోస్టులు?!

స్వరాష్ట్రంలో వ్యవసాయాన్ని విప్లవాత్మక మార్పులతో ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం వ్యవసాయ శాఖను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా శాఖాల వారీగా ఉద్యోగ భర్తీలు చేస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖలోని ఖాళీలనుక వాడా భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుత ఖాళీలు ఎన్ని, ఏ స్థాయిలో ఉన్నాయనే వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇదే
సమయంలో శాఖ బలోపేతం కోసం ఖాళీగా ఉన్న పోస్టులతో
పాటు మరో 1000 పోస్టులు అదనంగా మంజూరు
చేయనున్నారు. ఉద్యోగఖాళీల భర్తీలో భాగంగా ప్రస్తుతం
అవసరమున్న పోస్టులతో పాటు అదనపు పోస్టులు మంజూరు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖకు పూర్తి స్థాయిలో సిబ్బంది సమకూరనుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 800 పోస్టులు ఖాళీ

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ లో
అన్ని స్థాయిల్లో కలుపుకుని 4,500 మంది ఉద్యోగులు
పనిచేస్తున్నారు. ఈ 4,500 పనిచేస్తుండగా, ప్రస్తుత తక్షణ భర్తీ కింద 800 పోస్టులను అధికారులు గుర్తించారు. వీటిలో
అటెండర్ పోస్టులు 200కు పైగా నింపాల్సి ఉండగా, ఏవో
పోస్టులు 58, ఏఈవో పోస్టులు 200 ఉన్నాయి.
ఇవీ కాక ఖాళీగా ఉన్న ఇతర పోస్టులన్నీ చాలా ఏండ్ల క్రితం ఉన్న పోస్టులు.. అంటే మాలీ (స్వీపర్లు, ప్లాంటేషన్, గోడోన్లల్లో పనిచేసేవారు) ఉండడంతో వీటిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోనుంది. ఈ పోస్టుల విషయంలో ప్రభుత్వానిదే నిర్ణయమైనప్పటికీ అధికారులు మాత్రం ఖాళీల్లో. పోస్టులను కూడా చేర్చుతున్నారు.

ఉద్యోగులకు ప్రమోషన్లు కూడా

వ్యవసాయ శాఖలో ప్రస్తుతం ప్రమోషన్ల పర్వం నడుస్తుండగా.. ప్రమోషన్లపై అధికారుల నుంచి అసంతృప్తి
జ్వాలలో రేగడంతో ఇప్పటికీ పదోన్నతులు లభించలేదు. ఇదే
క్రమంలో తాజాగా సీఎం కేసీఆర్ మరో రెండు ఏడీ స్థాయి
పోస్టులు మంజూరు చేసిన నేపథ్యంలో ఆ పోస్టులు
ఇంతవరకూ భర్తీ కాలేదు. ఒకవైపు ప్రమోషన్లు, మరో వైపు
ఖాళీలపై దృష్టిసారించిన ప్రభుత్వం ఖాళీల నియామకాలతో
పాటు ప్రమోషన్లను కూడా పూర్తిచేయనున్నట్టు సమాచారం.
మార్కెటింగ్ ఎనాలసిస్, ఇన్‌పుట్ సబ్సిడీ కోసం ఏర్పాటు
చేసిన రెండు పోస్టులను భర్తీ చేసేందుకు కమిషనర్ చర్యలు
తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News