Friday, March 29, 2024

కొవాగ్జిన్ అనుమతిపై WHO సమీక్షా..

భారత్‌ బయోటెక్‌ కు చెందిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ కు ఈయూఎల్ (ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌ ​) గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ సంస్థ ప్రతినిధులతో సమావేశం పూర్తయిందని పేర్కొంది. భారత్ బయోటెక్ డేటాను WHO సమీక్షిస్తుందని ఆ సంస్థ ప్రతినిధి పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్స్‌, సినోవాక్‌, సినోఫార్మ్‌ టీకాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌ కింద గుర్తింపు జారీ అయింది. భారత్‌ బయోటెక్‌ వ్యాక్జిన్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత్‌ బయోటెక్‌ ఈ నెల తొలివారంలో అందజేసిందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందంగా వాటిని పరిశీలిస్తుందని పూనమ్‌ ఖేత్రపాల్‌ పేర్కొన్నారు. మరో వైపు డబ్ల్యూహెచ్‌ నేతృత్వంలో ఏర్పాటైన ‘కొవాక్స్‌’ కార్యక్రమం ద్వారా భారత్‌కు 7.5 మిలియన్‌ మోడెర్నా డోసులు అందించనున్నట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులను ఆర్థికశాఖలో కలుపుతూ ఇచ్చిన జీవో నిలిపివేత..

Advertisement

తాజా వార్తలు

Advertisement