Thursday, April 25, 2024

Fan moment | రోహిత్ సిక్సర్ కి ఎమోష‌నల్ అయిన అభిమాని.. హిట్ మ్యాన్ ను కౌగిలించుకున్న ఫ్యాన్

రాయ్‌పూర్ వేదికగా ఇండియా-న్యూజిలాండ్ మధ్య సెకండ్ వన్డే మ్యాచ్ జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు అద్భుతమైన బౌలింగ్ కనబ‌రిచింది. టీమిండియా దూకుడు బౌలింగ్‌ ముందు కివీస్ 108 పరుగులకే కుప్పకూలింది.

ఇక సెంకండ్ ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ జట్టుకు శుభారంభం చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో తన హాఫ్ సెంచరీ చేసి అభిమానులను ఎంతగానో అలరించాడు. అదే సమయంలో 10వ ఓవర్లో రోహిత్ అద్భుత సిక్సర్ బాదాడు. ఇంతలో, హిట్‌మ్యాన్‌కి అభిమాని ఒక‌రు గ్రౌండ్‌లోకి వేగంగా పరిగెత్తి రోహిత్‌ను కౌగిలించుకున్నాడు. ఈ క్షణం తర్వాత అభిమానుల్లో సందడి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement