Tuesday, November 28, 2023

బుట్ట‌బొమ్మ టీజ‌ర్‌కు ఫుల్ రెస్పాన్స్‌.. రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ చేసిన మేక‌ర్స్‌

మలయాళంలో సూపర్‌హిట్ అయిన సోష‌ల్ డ్రామా మూవీ ‘కప్పెల’ తెలుగులో ‘బుట్టబొమ్మ’గా రీమేక్ అవుతోంది. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ మూవీ టీజర్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

- Advertisement -
   

ఇక ఈ సినిమాని మొదట నెల (జనవరి) 26న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుశారు మేక‌ర్స్. అయితే తాజా అప్డేట్ ప్రకారం, సినిమా రిలీజ్ డేట్ వ‌చ్చే నెల (ఫిబ్రవరి) 4కి పోస్ట్ పోన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. గోపీ సుందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. గణేష్ కుమార్ రావూరి డైలాగ్స్ అందించగా, వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement